తన తండ్రి బతికుంటే ఆస్తి దక్కదని తండ్రినే మట్టుబెట్టాడు ఓ తనయుడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎనికేపల్లి శివారులో శవమై కన్పించిన బుచ్చిరెడ్డి హత్య కేసులో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. తన తండ్రి వద్ద ఉన్న 3 ఎకరాల పొలం కోసం బుచ్చిరెడ్డి పెద్ద కొడుకు విక్రంరెడ్డి తరచూ గొడవ పడేవాడు. భూమి దక్కించుకునేందుకు తండ్రిని చంపాలని విక్రమ్ రెడ్డి నిర్ణయించుకున్నాడు.
మాటల్లో దించి... టవల్‌తో గొంతు నులిమి...
డిసెంబర్ 27న వికారాబాద్ వెళ్లిన తన తండ్రిని మద్యం తాగుదామని తన మామ పొలంలోకి తీసుకెళ్లాడు. మద్యం సేవిస్తున్న క్రమంలో విక్రం రెడ్డి మాటల్లో దించగా... తన మామ నారాయణరెడ్డి వెనక నుంచి టవల్‌తో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఐదుగురు వ్యక్తులు కలిసి టవేరా వాహనంలో ఎనికేపల్లి తీసుకెళ్లి పొలంలో పడేసి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. హత్యలో పాల్గొన్న విక్రం రెడ్డితో సహా మిగిలిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్‌తో రైతు మృతి