Krishna Flood Flow: కృష్ణా నదికి ఎగువ నుంచి ప్రవాహం కొంత తగ్గింది. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి దిగువకు విడుదల నిలిచిపోయింది. జూరాల నుంచి 24 వేల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. తుంగభద్ర నుంచి 34 వేల క్యూసెక్కులు శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. డ్యాం వద్ద 68 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దిగువకు 59 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ వద్ద 59 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
మరోవైపు గోదావరి పరీవాహకంలో ఎస్సారెస్పీకి 86 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లికి 2.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. దిగువకు అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ బ్యారేజీకి(మేడిగడ్డ) 6.89 లక్షల ప్రవాహం ఉండగా దిగువకు అంతే వరదను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 5 యూనిట్లలో ఈనెల 23 అర్ధరాత్రి నుంచి 24వ తేదీ అర్ధరాత్రి వరకు 8.805 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానించినట్లు జెన్‌కో అధికార యంత్రాంగం తెలిపింది.
ఇవీ చదవండి.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం!