ETV Bharat / city

15 వందల ఎకరాల్లో వరి వర్షార్పణం.. - agriculture news in nalgonda

నాలుగైదు రోజుల్లో పంట చేతికొస్తుందన్న దశలో కురిసిన వర్షం.. రైతన్నను నిలువునా ముంచేసింది. అకాల వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. యాదాద్రి జిల్లాలోనే 15 వందల ఎకరాల్లో వరి వర్షార్పణం కాగా... మామిడి, బత్తాయిలు నేలరాలాయి.

crops affected by rains in telangana
15 వందల ఎకరాల్లో వరి వర్షార్పణం..
author img

By

Published : Apr 26, 2020, 6:22 AM IST

లాక్​డౌన్​ పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న దరిమిలా... పంటను అమ్ముకునేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్నదాతలు ఇప్పుడిప్పుడే మార్కెట్ల బాట పడుతున్నారు. మరికొందరు ఇంకో నాలుగైదు రోజుల్లోపు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో... అకాల వర్షం వారిపై పిడుగులా పడింది. ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తుండగా... ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 15 వందల ఎకరాల్లో వరి పనికిరాకుండా పోయింది.

వరి తుడిచిపెట్టుకు పోయింది

ఖరీఫ్​లో కురిసిన వర్షాలకు చాలా ఏళ్ల తర్వాత పెద్ద పెద్ద చెరువులు కూడా జలకళ సంతరించుకున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో గతానికి భిన్నంగా ఈ యాసంగిలో పెద్దఎత్తున వరి సాగు వేశారు. కానీ పంట చివరి దశలో అకాల వర్షం రైతన్నను నిలువునా ముంచేసింది. వలిగొండ మండలంలో వెయ్యి 30 ఎకరాల్లో, పోచంపల్లిలో 4 వందల ఎకరాల్లో వరి తుడిచిపెట్టుకు పోయింది. యాదాద్రి జిల్లాలో మొత్తంగా 640 మంది రైతులు పంటను కోల్పోవాల్సి వచ్చింది. అటు నల్గొండ జిల్లాలోని పెద్దవూర, పెద్దఆడిశర్లపల్లి, హాలియా సహా దేవరకొండ డివిజన్​లోని కొన్ని ప్రాంతాల్లో... ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది.

గతేడాది కన్నా చాలా తక్కువగా..

వడగండ్ల వానకు వరితోపాటు... మామిడి, బత్తాయి, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. మూడు జిల్లాల పరిధిలో వెయ్యి ఎకరాల్లో పంటలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేశారు. అసలే ఈ సీజన్​లో మామిడి దిగుబడి గతేడాది కన్నా చాలా తక్కువగా ఉంది. పూత, పిందే దశల్లో గాలివానకు తట్టుకున్నా... అకాల వర్షాలకు మాత్రం మామిడి కాయలు నేల రాలిపోయాయి. బ్యాంకులు, అధికారుల అలక్ష్యం వల్ల... ఈసారి 50 శాతం మంది రైతులు కూడా ప్రీమియం చెల్లించలేదు. ఫలితంగా బీమా అందుకునే పరిస్థితి లేకుండా పోయింది.

ఇవీ చూడండి: 'రైతులు నిశ్చింతగా విత్తనాలు కొనుగోలు చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.