నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు మండలాల్లో పల్లెప్రగతిలో భాగంగా జరుగుతున్న పనులను కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ పర్యవేక్షించారు. పలివెల గ్రామంలో నిర్మించిన కంపోస్టు షెడ్‌ను ఆయన ప్రారంభించి.. నర్సరీని తనిఖీ చేశారు. మండలంలోని సమస్యలను, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాల ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా మిషన్ భగీరథ, మునుగోడులో ముప్ఫై పడకల ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రాలకు భవన నిర్మాణాలు, రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, గురుకుల పాఠశాల కోసం ప్రభుత్వ స్థలం కేటాయింపు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?