ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 14న జరిగే సభకు... ఆయన హాజరుకానున్నారు. అనుముల మండలంలో సీఎం సభ జరగనుండగా... ఏ ప్రాంతంలో నిర్వహించాలనే అంశంపై పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకునే సమయంలో ముఖ్యమంత్రి రాకతో... ఓటర్లను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో గులాబీ నేతలు ఉన్నారు.
ఉపఎన్నిక ప్రకటన రాకముందే సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 10న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్ వద్ద 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం... హాలియాలో నిర్వహించిన ధన్యవాద సభకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి సీఎం రాకతో... గత పర్యటనలో ఇచ్చిన హామీలపై ఓటర్లలో విశ్వాసం కలగజేసే అవకాశం ఏర్పడబోతోందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సాగర్ అభ్యర్థులు