ETV Bharat / city

అక్కడ జీతం బదులు సిమెంట్ బస్తాలిస్తారు.. - అక్కడ జీతం బదులు సిమెంట్ బస్తాలిస్తారు..

ప్రాజెక్టుల నిర్మాణం అంటే దానిలో వాడే ప్రధాన ముడి సరుకు అంటే సిమెంటే గుర్తొస్తుంది.  కానీ ఆ ప్రాజెక్టుకు నిధులే రాకపోతే... గుత్తేదారులకు, ఉప గుత్తేదారులుకు ఇబ్బందే. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న నక్కలగండి ప్రాజెక్టులో.... చేసిన పనికి డబ్బులు రాక.. ఉప గుత్తేదారు సిమెంటునే అమ్ముకుని అప్పులు తీర్చుకుంటున్నారు. వందలాది బస్తాలు వదులుకోలేక... తీసుకున్నాక వాటిని అమ్ముకోలేక అక్కడి కార్మికులు అవస్థ పడుతున్నారు.

అక్కడ జీతం బదులు సిమెంట్ బస్తాలిస్తారు..

author img

By

Published : Dec 12, 2019, 6:00 AM IST

అక్కడ జీతం బదులు సిమెంట్ బస్తాలిస్తారు..

సాగునీటి ప్రాజెక్టులకు... సిమెంటు ఖర్చులు కోట్లల్లో ఉంటాయి. వస్తున్న నిధులను బట్టి... కొనుగోళ్లు జరుగుతుంటాయి. కానీ నిధులు రాక, చేసిన పనికి పైకం చెల్లించే స్థోమత లేక... సిమెంటు బస్తాల్ని అమ్ముకుంటున్న దీనావస్థ... నక్కలగండి ప్రాజెక్టు వద్ద నెలకొంది. శ్రీశైలం మిగులు జలాల ద్వారా మూడున్నర లక్షల ఎకరాల సాగుకు... 520 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో 2006లో ఎస్​ఎల్​బీసీకి శ్రీకారం చుట్టింది ఆనాటి ప్రభుత్వం.

నిలిచిపోయిన పనులు...

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద పనులు ప్రారంభమవగా... జయప్రకాశ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాటిని దక్కించుకుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి గ్రామ సమీపంలో... 7.25 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం పనులు జరుగుతున్నాయి. ఉప గుత్తేదారుగా కోస్టల్ కంపెనీకి... రూ.131 కోట్లతో పనులు అప్పగించారు. అయిదేళ్లలో సొరంగ మార్గం తవ్వకాలు, లైనింగ్ పూర్తి చేసేందుకు... ఒప్పందం కుదుర్చుకున్నారు. బకాయిలు సకాలంలో చెల్లించక పోవడం వల్ల సొరంగం పనులు పూర్తి కాలేదు.
పనులు ప్రారంభించారు... బస్తాలిచ్చారు..

ప్రధాన గుత్తేదారు ఒత్తిడితో నవంబరులో కాంక్రీటు పనులను పునః ప్రారంభించారు. ఈ మేరకు రూ.1.50 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉండగా... నగదు బదులు 70 వేల సిమెంటు బస్తాలు అంటగట్టాడు. ఉప గుత్తేదారు సైతం కార్మికులకు వేతనాలు బదులు సిమెంటు బస్తాలు అంటగడుతున్నాడు.

ఇది ఓ ఉదాహరణ..

తెల్దేవర్​పల్లికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి సొరంగం పనులు చేసినందుకు గాను.. లక్షా 30 వేలు చెల్లించాల్సి ఉండగా.. 500 సిమెంటు బస్తాలు ముట్టజెప్పాడు ఉప గుత్తేదారు. సిమెంట్​ బస్తాలు కూడా వద్దంటే మొత్తానికే నష్టపోతామన్న ఉద్దేశంతో రాంబాబు... బస్తాల్ని తన ఇంట్లోనే వేయించుకున్నాడు. ఇప్పుడు వాటిని అమ్ముకునే పనిలో పడ్డాడు రాంబాబు.

2021 డిసెంబరు నాటికి సొరంగం పనులు పూర్తి చేయాలన్న ఐదో ఒప్పందం సైతం... ఇలాంటి పరిస్థితుల నడుమ మరుగునపడిపోయే అంచున చేరింది.

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.