Praja Sangrama Yatra: తెరాస ఆగడాలను ఎదుర్కొనే సత్తా భాజపాకు మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బతీస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ భాజపా మాత్రమేనని.. మోదీ నాయకత్వాన్ని నమ్మి ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో రోజు పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్... బస్వాపురం శివారు నుంచి బయలుదేరారు. ఇందిరమ్మ కాలనీ, భువనగిరిలో ఈరోజు యాత్ర కొనసాగనుంది. ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ దెబ్బతీస్తున్నారని... భాజపా సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరే వారికి సముచిత గౌరవం కల్పిస్తామని బండి సంజయ్ తెలిపారు.
'భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఎవరూ చేరుతామన్నా వద్దనదు. మోదీ నాయకత్వం, భాజపా సిద్ధాంతాలు నమ్మి పార్టీలో చేరేవారిని స్వాగతిస్తాం. తెరాస ఆగడాలను ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉద్యమ కారులకు వేదిక భాజపా. ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బతీశారు. అన్ని సర్వేల్లో వచ్చాయి తెరాసను ఎదుర్కొనే పార్టీ భాజపా. దానిని నాయకులు గుర్తించి చాలా మంది పార్టీలోకి వస్తున్నారు. పార్టీలో వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తాం.'-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
today bandi schedule: యాదాద్రి నుంచి వరంగల్ వరకు 328 కిలోమీటర్ల మేర సాగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. 5 జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఆగస్టు 26న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది.
ఇవీ చదవండి: