ETV Bharat / city

జాతర్ల సంరంభం: 25 రోజుల వ్యవధిలోనే మూడు పెద్ద ఉత్సవాలు - festivals in telangana

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతర సంరంభం మొదలుకాబోతోంది. జిల్లా నలుమూలల నిర్వహించే... ఉత్సవాల కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముంది. చెర్వుగట్టు , పెద్దగట్టు జాతర.. యాదాద్రి బ్రహ్మోత్సవాలతో పాటు జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలతో.. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసంద్రం కాబోతోంది. కేవలం 25 రోజుల వ్యవధిలోనే... 3 పెద్ద జాతరలు జరగనుండటంతో ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి.

జాతర్ల సంరంభం: 25 రోజుల వ్యవధిలోనే మూడు పెద్ద ఉత్సవాలు

author img

By

Published : Jan 9, 2021, 2:47 AM IST

జాతర్ల సంరంభం: 25 రోజుల వ్యవధిలోనే మూడు పెద్ద ఉత్సవాలు

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాల్లో... ఉత్సవాలు జరగబోతున్నాయి. నల్గొండ జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రం... చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి 24 వరకు 6 రోజుల పాటు ఉంటాయి. చెర్వుగట్టు జాతర ముగిసిన 3 రోజులకే.. సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు...5 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ వేడుకలు పూర్తైన తర్వాత సరిగ్గా 11 రోజులకు... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల సంరంభం మొదలవుతుంది. మార్చి 15 నుంచి 25 వరకు... 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వీటన్నింటికన్నా ముందుగానే ఈ నెల 20న మొదలయ్యే జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు.. 22 వరకు కొనసాగుతాయి. పెద్దగట్టు జాతర కోసం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ఒకవైపు మూసివేయడం వల్ల... ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..

6 - 8 లక్షల మంది భక్తుల రాక..

చెర్వుగట్టులో రెండో ఘాట్ రోడ్డు లేదు. ఆలయం ఏడాది ఆదాయం రూ.12 కోట్లుండగా... ఏర్పాట్లు మాత్రం నాసిరకంగా ఉన్నాయని... భక్తుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. చెర్వుగట్టు జాతరకు 6 రోజుల్లో... 4 లక్షల మంది హాజరవుతుంటారు. స్వామి వారి కల్యాణం, అగ్నిగుండాల వేడుకలకు భారీగా జనం వస్తారు. పెద్దగట్టు జాతరకు 5 రోజుల్లో 6 నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరవుతుంటారు. యాదాద్రిలో పునర్నిర్మాణాల దృష్ట్యా... కొండపై జరిగే కల్యాణానికి ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కొండ కింద నిర్వహించే తిరు కల్యాణానికి భారీస్థాయిలో భక్తులు వస్తారు

మేడారం తర్వాత ఆ స్థాయిలో..

ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగే జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు... రెండున్నర లక్షల మంది యాత్రికులు హాజరయ్యే అవకాశం ఉంది. 20న వేకువజామున నిర్వహించే వేడుకకు... 50 వేల మంది, 21న చేపట్టే గంధోత్సవానికి లక్షన్నర మంది వచ్చే అవకాశం ఉంది. చివరి రోజు సైతం ఇంకో 50 వేల మంది.. దర్గాను దర్శించుకుంటారు. కొవిడ్ దృష్ట్యా భక్తుల నిబంధనలు కట్టుదిట్టంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. మేడారం తర్వాత ఆ స్థాయిలో ఉండే జాతరగా... గుర్తింపున్న పెద్దగట్టుకు వచ్చే జనాల్ని... ఎలా నియంత్రించాలన్న దానిపై అధికారులు దృష్టిసారించారు.

ఇవీ చూడండి: అరబిక్​ రుచులు.. అందించే అతివలు.. ర్యాంప్​పై హొయలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.