సార్వత్రిక ఎన్నికల వేళ హస్తం పార్టీకి కొలుకోలేని దెబ్బ తగులుతోంది. రోజుకో ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నారు. తాజాగా కొల్లాపూర్ శాసనసభ్యులు హర్షవర్ధన్‌రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. హర్షవర్ధన్‌తో కలిపి గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఇవీ చూడండి:'అరుణ చేరిక శుభపరిణామం'