ETV Bharat / city

కాంగ్రెస్​లో లీడర్లేక్కువ.. కార్యకర్తలు తక్కువ: హరీశ్​

కాంగ్రెస్​లో లీడర్లు ఎక్కువైపోయారని హరీశ్ రావు​ ఎద్దేవా చేశారు. రాహుల్​ సభలకు కార్యకర్తలు కరవయ్యారన్నారు. మెదక్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో 400 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు హరీశ్​ సమక్షంలో తెరాసలో చేరారు.

మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్​లో ఎన్నికల ప్రచార సభ
author img

By

Published : Apr 1, 2019, 9:56 PM IST

రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మెదక్​ పార్లమెంట్​ స్థానాన్ని గెలవబోతున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభాకర్​ రెడ్డికి మద్దతుగా మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్​లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్​లో కార్యకర్తలు తక్కువ, లీడర్లు ఎక్కువని ఎద్దేవా చేశారు. రాహుల్​ సభలకు ప్రజలు కరవయ్యారని విమర్శించారు. హస్తం పార్టీలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్​తో పాటు 400 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు హరీశ్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్​లో ఎన్నికల ప్రచార సభ

ఇవీ చూడండి:'అభివృద్ధి కోసమే మరోసారి గెలిపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.