ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని జిల్లా కలెక్టర్‌కు ఎదురెళ్లి తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పింది. కలెక్టర్ కూడా ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా కచ్చితమైన చర్యలు చేపట్టారు. అంతే.. ఏళ్ల తరబడి కొనసాగిన దురాచారానికి తెరపడింది. ఇది మంచిర్యాల జిల్లాలోని రేచిని గ్రామ విజయగాథ.
The girl stopped child marriages in rechini village
By
Published : Mar 13, 2021, 6:47 AM IST
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2017 ఏప్రిల్ 20న జరిగిన బాలోత్సవంలో పాల్గొని వేదిక దిగుతున్న అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దగ్గరికి ఒక బాలిక వెళ్లింది. ‘‘సార్ మా ఊర్లో చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేస్తున్నారు.. మాకేమో చదువుకోవాలని ఉంటోంది. మీరే ఏదైనా చేయాలి సార్’’ అని అభ్యర్థించింది. ఆ బాలికే రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని జి.రమాదేవి. (ఇప్పుడు హన్మకొండలో ఇంటర్ చదువుతోంది).. ఆ మాటలు విన్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ (ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్) వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కొద్ది రోజుల్లోనే ఆ గ్రామంలో ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీస్ అధికారులు, గ్రామస్థులతో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. బాల్య వివాహాలు చేయబోమని గ్రామస్థులందరితో ప్రమాణం చేయించారు. ఎవరైనా అలా చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది.
గ్రామస్థుల శపతం
ఏటా 10 నుంచి 15 బాల్య వివాహాలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రేచిని గ్రామం. సుమారు 300కు పైగా కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తాయి. 2016 కంటే ముందు ఆ గ్రామంలో ఏటా 10 నుంచి 15 బాల్య వివాహాలు జరిగేవి. 2017లో ఓ వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు.కలెక్టర్ ఆదేశాలతో అధికారులు నిఘా పెట్టడం.. చాలా మంది బాలికలు చదువుకొని ఉద్యోగాలు సాధిస్తుండటంతో తల్లిదండ్రుల ఆలోచన మారింది. దీంతో నాటి నుంచి నేటి వరకు గ్రామంలో ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదు. బాలికలంతా చదువు, క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 200 మంది డిగ్రీ చదివిన విద్యార్థినులు ఉన్నారు. 18 మంది యువతీ యువకులు ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధించారు.
నాతోటి వారందరికీ పెళ్లిళ్లు అవుతున్నాయి.. ఏదో ఒకరోజు నా వంతు వస్తుంది.. వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకోలేదు. పెళ్లయితే చదువు ఆగిపోతుందని భయపడ్డా. ఏదో ఒకటి చేయాలని అనుకున్నా.కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే ఉపయోగం ఉండొచ్చని అనిపించింది. అనుకోకుండా దక్కిన అవకాశాన్ని వినియోగించుకున్నా. కలెక్టర్‌కు ఎదురెళ్లి మా ఊళ్లో పరిస్థితిని చెప్పాను.మా ఊళ్లో బాల్యవివాహాలు ఆగిపోవడం, అందరూ చదువుకుంటుండటంతో చాలా సంతోషంగా ఉంది.
ఆసక్తితో పాటు ప్రోత్సాహం.. - తాళ్లపల్లి దీపిక, మెడికో
దీపిక
నేను పాఠశాలలో చదువుకునే రోజుల్లో నా తోటి విద్యార్థినులకు పెళ్లిళ్లు అవుతుండేవి. ఆ పరిస్థితి చూసి నాకు భయమేసేది. క్రమంగా పరిస్థితులు మారిపోవడంతో అమ్మ ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టాను. నాన్నలేని లోటును రానీయకుండా నన్ను కష్టపడి చదివించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నాను.
మార్పు వచ్చింది... - లావణ్య, ఫుట్‌బాల్ క్రీడాకారిణి
లావణ్య
అమ్మనాన్నను ఒప్పించి పాఠశాల స్థాయి నుంచే ఫుట్‌బాల్ ఆడాను. 11 సార్లు జాతీయ, 20 సార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాను. క్రీడల్లో రాణిస్తుండటం కూడా నన్ను చదివించేందుకు ఒక కారణమైంది. ఇప్పుడు మా ఊళ్లో బాల్య వివాహాలు లేవు.