ETV Bharat / city

ఎగువన వర్షం... దిగువన వరద - జూరాల ప్రాజెక్టు

రానున్న నాలుగు రోజుల్లో జూరాల జలాశయానికి వరద ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.  2011లో జలాశయానికి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా మరో వారం రోజుల్లో అదే స్థాయిలో వరద వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే  శ్రీశైలం జలాశయం కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది.

ఎగువన వర్షం... దిగువన వరద
author img

By

Published : Aug 7, 2019, 5:07 AM IST

Updated : Aug 7, 2019, 9:27 AM IST

ఎగువన వర్షం... దిగువన వరద

మరో నాలుగు రోజుల్లో జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తనుంది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం ఆల్మట్టి జలాశయానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. అదే స్థాయిలో ఆల్మట్టి నుంచి వరద ప్రవాహాన్ని నారాయణపూర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ జలాశయం నుంచి సుమారు 3 లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.

ఔట్​ ఫ్లో 72వేల క్యూసెక్కులు

జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.06 మీటర్లకు చేరుకుంది. 9.657 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 8.673 టీఎంసీల నీరు ఉంది. జూరాలకు ఇప్పుడు 2 లక్షల 78 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా స్పిల్​వే గేట్ల ద్వారా 2 లక్షల 39 వేల క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 26 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వీటితోపాటు జూరాల ఎడమ, కుడి, సమాంతర కాలువలకు నెట్టెంపాడు బీమా కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం 2 లక్షల 72వేల క్యూసెక్కులు జూరాల ఔట్ ఫ్లో గా ఉంది.

2009లో 10 లక్షల క్యూసెక్కులు

గత 18 సంవత్సరాలలో జూరాలకు వచ్చిన వరద ఉద్ధృతిని గమనిస్తే 2009లో జలాశయానికి అత్యధికంగా 10 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. 2005 ఆగస్టులో 6 లక్షల 96 వేల క్యూసెక్కుల నీరు , 2006 ఆగస్టులో 6 లక్షల 334 క్యూసెక్కులు, 2011 సెప్టెంబర్ 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది.

మూడ్రోజుల్లో 5 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టి నుంచి వచ్చే 4 లక్షల క్యూసెక్కులు, బీమా నది నుంచి మరో లక్ష క్యూసెక్కుల నీరు కలిపి మూడ్రోజుల్లో 5 లక్షల క్యూసెక్కుల నీరు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Aug 7, 2019, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.