ETV Bharat / city

ఉమ్మడి పాలమూరులో గత 2 రోజులుగా కొత్త కేసులు లేవు

author img

By

Published : Apr 28, 2020, 1:54 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు కాకపోవడం అధికారులకు కొంత ఊరట కలిగిస్తోంది.

There have been no new cases in the joint Palamooru for the past 2 days
ఉమ్మడి పాలమూరులో గత 2 రోజులుగా కొత్త కేసులు లేవు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో గత 2 రోజులుగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 45 పాజిటివ్ కేసులు ఉన్నాయి. గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, రాజోలి ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు కాగా.. వారి ప్రైమరీ కాంటాక్టు వారందరినీ ప్రస్తుతం హోం క్వారంటైన్​కు తరలించారు. సుమారు 1250 మంది హోం క్వారంటైన్​లో కొనసాగుతున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఎక్కువ మంది వైద్యం కోసం కర్నూల్​కు వెళుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కర్నూల్​కు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తున్నారు. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోంచి జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇక మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్ జిల్లాల్లో కొత్త కేసులు లేవు. వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసూ నమోదు కాలేదు. అన్ని చోట్ల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించారు.

ఇదీ చూడండి: ప్రజలు బయటకు రాకుండా తాళాలు.. తెరిపించిన కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.