ETV Bharat / city

మహబూబ్‌నగర్‌లో మరో భూ మాయ... ప్రభుత్వ స్థలంపై పెద్దల కన్ను

రాష్ట్రంలో ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు జెండా పాతెస్తున్నారు. గూడు లేని నిరుపేదలకు సర్కారు ఇచ్చిన భూములను సైతం కబ్జా చేసేస్తున్నారు. కొంతమంది అవినీతి అధికారుల అండతో.... పాత తేదీలతో రాత్రికిరాత్రే నకిలీ పట్టాలు సృష్టించుకుని పాగా వేసేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్‌ జిల్లా క్రిస్టియన్‌పల్లిలోని 523 సర్వే నంబర్‌లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. రెండు పడకల ఇళ్ల కోసం ఎంపికైన జాబితాలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.

sarvey no.523 place occupied by politicians in mahabubnagar

author img

By

Published : Sep 26, 2020, 11:33 AM IST

Updated : Sep 26, 2020, 1:43 PM IST

మహబూబ్‌నగర్‌లో మరో భూ మాయ... 100 కోట్ల స్థలంపై పెద్దల కన్ను

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్‌పల్లిలోని సర్వే నెంబర్ 523లో ఇంటి నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లను నిర్మిస్తున్నారని నాడు అధికారులు కూల్చివేసిన చోటే... ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టా లేకుండా ఇల్లేలా నిర్మిస్తున్నారని ఓ మహిళను ఈనాడు-ఈటీవీ భారత్​ బృందం ప్రశ్నించగా.... 3రోజుల కిందటే తనకు పట్టా ఇచ్చారని అంతకుముందు పట్టా లేనందువల్లే ఇల్లు కూల్చారని చెప్పారు. 523సర్వే నంబర్‌లో గత కొన్నేళ్లుగా 2వేల500 మందికి పట్టాలిచ్చినట్లు గుర్తించారు. అందులో అర్హులకు చెందినవి కేవలం 586 ఉన్నట్లు 2017లో అధికారులు తేల్చారు. ఆ తర్వాత కొత్తగా పట్టాలివ్వకూడదని నిర్ణయించారు. కాని 3రోజుల క్రితం ఆ మహిళకు పట్టా ఎలా ఇచ్చారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2008లోనే మంజూరైనట్లు పట్టా...

అదే సర్వే నంబర్‌లో 75గజాల స్థలానికి పట్టా ఇస్తానని చెప్పి ఇటీవలే ఓ పార్టీ నేత నలుగురి వద్ద 4 లక్షలు తీసుకున్నారు. 2008లో మంజూరైనట్లుగా వారి చేతికి పట్టా ఇచ్చారు. ఆ భూమి కోసం వెళ్తే... అది తమ స్థలమంటూ ఇంకొకరు గొడవకు దిగారు. ఇలా పలువురి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్ నూతన కలెక్టరేట్ కు సమీపంలో, బైపాస్ రహదారికి కొద్దిపాటి దూరంలో ఉన్న భూములు కావడం... పక్కనే తాజాగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లుండడంతో... ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆ భూముల్ని దక్కించుకునేందుకు అక్రమాలకు తెరలేచింది. ఇప్పటికే పట్టాల పేరిట కోట్ల రూపాయలు చేతులు మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు పడకల ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాలోనూ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దొంగ పట్టాలతో క్రమబద్ధీకరణకు యత్నం...

సర్వే నంబర్ 523లో పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు కేవలం 60, 75 గజాలవి మాత్రమే. కాని అక్కడ 100 నుంచి 200 గజాల మేర పునాదులున్నాయి. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. తమకు పట్టా ఉందంటూ రోజుకొకరు అక్కడి స్థలాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎల్​ఆర్​ఎస్​ నేపథ్యంలో కొందరు దొంగ పట్టాలతో భూముల్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకు అధికారులూ సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం వెంటనే 523 సర్వే నంబర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారులు నిరుపేద కుటుంబాలను గుర్తించి... వారికి రెండు పడకల ఇళ్లు లేదా ఇంటి స్థలం ఇవ్వాలని వామపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: నాలాల అక్రమ ఆక్రమణలు.. పట్టణాలను ముంచెత్తుతున్న వరద

Last Updated : Sep 26, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.