ETV Bharat / city

పునరావాసం కల్పించడంలో అధికారుల మీనమేషాలు - Palamooru- rangareddy project news

'ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య... ఏరు దాటాకా బోడి మల్లయ్య' అన్న చందంగా తయారైంది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొందరు అధికారుల వ్యవహారశైలి. ప్రాజెక్టుల భూసేకరణ కోసం రైతుల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసే అధికారులు... వారికి పరిహారం అందించడం, పునరావాసం కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రాజెక్టుల కోసం సర్వస్వం కోల్పోతున్న ముంపు బాధితులు... సకాలంలో సర్కారు సాయమందక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

పునరావాసం కల్పించడంలో అధికారుల మీనమేషాలు

author img

By

Published : Sep 18, 2020, 5:51 AM IST

Updated : Sep 18, 2020, 10:14 AM IST

పునరావాసం కల్పించడంలో అధికారుల మీనమేషాలు

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని బండరావిపాకుల... పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ముంపు గ్రామం. నాలుగైదు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతమైన ఈ పల్లె వైపు వరద పోటెత్తుతోంది. భయాందోళనలకు గురై స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి పక్కనే ఉన్న పాఠశాలలో తలదాచుకున్నారు. మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. వరద ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియక ఇంకొందరు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు.

కొందరికే పరిహారం..

ఏదుల జలాశయం కింద ఈ పల్లె పూర్తిగా ముంపునకు గురవుతోందని 2015లోనే ప్రభుత్వం గుర్తించింది. సుమారు 1,500 ఎకరాల వరకు ఇక్కడి రైతులు భూములు కోల్పోతున్నారు. కొందరికి పరిహారం అందింది. ఇంకొందరి అందాల్సి ఉంది. ఇప్పటికే ఏదుల జలాశయం పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ జలాశయాన్ని నింపాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు మాత్రం పునరావాసం కల్పించలేదు. దీంతో వరద ముంచెత్తుతున్నా... ఎక్కడికెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు గ్రామస్థులు.

పునరావాసం కోసం ఆందోళన..

గ్రామంలో 978 కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నాయి. 18 ఏళ్లు నిండిన 243 మందికి ప్యాకేజీ వర్తింపజేయాల్సి ఉంది. నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద పరిహారం, ఇంటి స్థలాన్ని ప్రభుత్వం అందించాలి. పక్కనే ఉన్న గౌరిదేవిపల్లిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినా.. అడుగు ముందుకు పడలేదు. పునరావాసం కోసం మూడేళ్లుగా గ్రామస్థులు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రికి సైతం గోడు వెల్లబోసుకున్నారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. వరద నీరు గ్రామాన్ని తాకినా ఏ అధికారి తమకు భరోసా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు.

ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితుల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. శ్రీరంగపురం జలాశయం కింద నాగరాల, శంకర సముద్రం జలాశయం కింద కానాయిపల్లి, సంగంబండ జలాశయం కింద నేరేడుగం ఇలా ఎన్నో గ్రామాలు ప్రభుత్వాలు పునరావాసం కల్పించకపోవడం వల్ల ఏటా ముంపునకు గురవుతూనే ఉన్నాయి. బండరావి పాకులకు ముంపు కష్టాలు రాకముందే ప్రభుత్వం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: భద్రతకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలి: జీఎం గజానన్‌ మాల్య

Last Updated : Sep 18, 2020, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.