ETV Bharat / city

మూడు పువ్వులు ఆరు కాయలుగా బియ్యం అక్రమ రవాణా - పీడీఎస్​ బియ్యం అక్రమ రవాణా

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకుంటున్న ఘటనలు నిత్యం ఏదో మూలన వెలుగు చూస్తున్నాయి. అయినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఫలితం మాత్రం శూన్యం. పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసుల అండదండలతోనే వ్యాపారం జోరుగా సాగుదోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

మూడు పువ్వులు ఆరు కాయలుగా బియ్యం అక్రమ రవాణా

author img

By

Published : Sep 25, 2020, 12:15 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట బియ్యం పట్టుబడటం పరిస్థితికి అద్దం పడుతోంది. మహబూబ్​నగర్ జిల్లాలో మార్చి నుంచి సెప్టెంబర్​ వరకు సుమారు 300 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ సుమారు 500 క్వింటాళ్లు పట్టుబడగా... 27 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు వరకు... టాస్క్​ఫోర్స్ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న 518 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని... 28 కేసులు నమోదు చేశారు. నారాయణపేట్ పోలీస్ స్టేషన్ పరిధి అప్పిరెడ్డిపల్లిలో... 21 క్వింటాళ్లు, లక్ష్మీపూర్​లో 30 క్వింటాళ్లు, మద్దూర్ స్టేషన్ పరిధిలో 50 క్వింటాళ్లు, మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి మంతన్​గోడ్​లో 12 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టుకున్నారు. నారాయణపేట జిల్లాలో 425 క్వింటాళ్లు పట్టుకొని 29 కేసులు నమోదు చేశారు. వనపర్తిలో మార్చి నుంచి 2వేల క్వింటాళ్లు స్వాధీనం చేసుకొని, 63 కేసులు నమోదు చేశారు. కొన్ని రైస్ మిల్లులు పలుమార్లు పట్టుబడటం గమనార్హం. ఆత్మకూరులో ఓ పిడీ యాక్టు సైతం నమోదైంది.

ఎలా చేస్తున్నారు..

ప్రతి నెలా ప్రజా పంపిణీ కోసం వచ్చే బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారులు మాత్రం రూ.5 నుంచి రూ.10లకు డీలర్​కే అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల దళారులకు, కిరాణా దుకాణాలకు విక్రయిస్తున్నారు. డీలర్ల నుంచి సేకరించే అక్రమార్కులు... ఓ చోట నిల్వ చేసుకుంటారు. కొంతమంది రైస్ మిల్లుల్లో, గోదాముల్లో దాచేస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని దళారులకు రూ.10 నుంచి రూ.12లకు అమ్ముతారు. పెద్ద మొత్తంలో సేకరణ పూర్తయ్యాక... పాలిష్ చేసి సన్నగా మార్చి వాహనాల్లో సరిహద్దులు దాటిస్తారు. రూపాయికి వచ్చే బియ్యాన్ని ముంబయి, బెంగళూరులో రూ.50 నుంచి రూ.60లకు విక్రయిస్తారు.

తిరిగి ప్రభుత్వానికే..!

నారాయణపేట జిల్లాలో బియ్య అక్రమ రవాణా... కర్ణాటకలోని గురుమిట్కల్ కేంద్రంగా మాఫియా పని చేస్తోంది. వీరికి ప్రతి మండలానికి ఓ ఎజెంట్ ఉండి... బియ్యం సేకరిస్తారు. ఓ చోట నిల్వ చేసి తర్వాత వాటిని... గురుమిట్కల్​ గుండా ముంబయికి తరలిస్తున్నారు. దామరగిద్ద మండలంలో ప్రధాన పార్టీకి చెందిన ఓ వ్యక్తి, మద్దూరు మండలంలో ఇద్దరు వ్యక్తులు కీలక భూమిక పోషిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లందరికీ స్థానికంగా రాజకీయ అండదండలతోపాటు అధికారుల సహకారం కూడా ఉండటం వల్ల దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యాపారులు బియ్యం అక్రమ రవాణాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. గ్రామాలు, మండలాల నుంచి సేకరించి... రాయచూర్​కు తరలిస్తారు. అక్కడ పాలిష్ చేసి... కిలో రూ.40 నుంచి రూ.60లకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. వనపర్తి, నాగర్​కర్నూల్ జిల్లాల్లో... కస్టమ్ మిల్లింగ్​ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మర పట్టకుండానే... పాలిష్ చేసి సీఎంఆర్​ బ్రాండ్​ పేరుతో తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

అధికారులు ఏం చేస్తున్నారు?

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్​ఫోర్స్ అధికారులు, విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయట పడుతున్నాయి. ఇలా పట్టుబడినప్పుడల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప అక్రమార్కులపై కఠిన చర్యలు ఉండటం లేదు. పదే పదే పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడం, పీడీ యాక్టు ప్రయోగించడం లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయినా ఆ దిశగా అడుగు ముందుకు వేయడం లేదు. బియ్యం పట్టుబడినా... పలుమార్లు అధికారులే చూసిచూడనట్లు వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్ల మత్తులో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే అక్రమ రవాణా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: నాలాల అక్రమ ఆక్రమణలు.. పట్టణాలను ముంచెత్తుతున్న వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.