ETV Bharat / city

మహబూబ్​నగర్​ వరద బాధితుల కోసం టోల్​ఫ్రీ నెంబర్ - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వరద ప్రాంతాల పర్యటన

Srinivas Goud visited flood affected areas in Mahabubnagar: గత రెండు రోజులుగా మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు వరదనీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ప్రజలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకరించాలని కోరారు.

Minister Srinivas Goud
మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Sep 30, 2022, 7:04 PM IST

Srinivas Goud visited flood affected areas in Mahabubnagar: మహబూబ్‌నగర్‌ పట్టణంలో వరదనీరు, మురుగునీరు సులభంగా బయటకు వెళ్లేలా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎక్సైజ్​, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఊహించని వర్షంతోనే ముంపు ముప్పు: పెద్ద చెరువు కింది ప్రాంతంలో వెళ్లే దారిలో పెద్ద ఎత్తున నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయకచర్యలు ప్రారంభించారు. దీనితో అక్కడ సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి గడిచిన రెండు రోజుల నుంచి పాలమూరు పట్టణంలో ఎప్పుడు ఊహించని విధంగా 10.7 సెంటి మీటర్ల వర్షం కురిసిందన్నారు. తక్కువ సమయంలో పెద్దవర్షం కురవడం వల్ల రామయ్యభౌలి సహా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందని మంత్రి తెలిపారు.

బాధితుల కోసం టోల్​ఫ్రీ నెంబర్: లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. నిన్నరాత్రి ఆల్మాస్ ఫంక్షన్ హాల్, కురిహిని శెట్టికాలని, బికె రెడ్డి కాలనీలలో ముంపు బాధితుల కోసం ఆశ్రయం, భోజనం ఏర్పాటు చేశామన్నారు. గతంలో మహబూబ్‌నగర్‌లో వానాకాలంలో చెరువులో చుక్కనీరు ఉండేది కాదన్నారు. కానీ 8ఏళ్లుగా వర్షాలు కురిసి చెరువు నిండేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టడం ఒక కారణమన్నారు. వరద బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకారం అందించాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కోరారు.

లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.