నిరుపేదలందరికి నీడ కల్పించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వనపర్తి జిల్లా గణపురం మండలం ఆయన పర్యటించారు. పోతుల కుంటలో పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అర్హులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.
ప్రస్తుతం ఇలు రాని వారు బాధపడొద్దని.. అర్హులైన వారందరికి ఇంటి పట్టాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇళ్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే వాటన్నింటిని పూర్తి చేసి పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: పాత కక్షలతో కాల్పులు: ఆదిలాబాద్ ఘటనలో వ్యక్తి మృతి