ETV Bharat / city

Srinivas Goud Murder Plan : 'ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు'

Srinivas Goud Murder Plan : తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌.. తాను చేసిన అవినీతి, కబ్జాలపై ప్రశ్నించిన యువకులను కిడ్నాప్ చేయించడమే గాక.. తనపైన వాళ్లు హత్యకు కుట్ర చేశారని తప్పుడు కేసులు బనాయించారని భాజపా నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ ఆరోపించారు. ఈ విషయంలో నిజానిజాలు తేలేలా అన్ని విచారణ సంస్థలు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. ఇందులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Goud Murder Plan
Srinivas Goud Murder Plan
author img

By

Published : Mar 3, 2022, 7:06 AM IST

Srinivas Goud Murder Plan : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తప్పుల్ని బయటపెట్టిన యువకులపై సైబరాబాద్‌ పోలీసులు హత్యాయత్నం పేరుతో తప్పుడు కేసు పెట్టారని భాజపా నేతలు జితేందర్‌రెడ్డి, డీకే అరుణ వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని, కొందరు పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నిజం నిగ్గు తేలుస్తాం..

Plan for Srinivas Goud Murder : "మంత్రి అవినీతి, కబ్జాలపై ప్రశ్నించిన యువకుల్ని కిడ్నాప్‌ చేయించారు. బాధిత కుటుంబ సభ్యులు నా దగ్గరకు వస్తే దాని గురించి నేను మాట్లాడా. ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు. ఎన్నికల్లో మంత్రి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కొందరు వ్యక్తులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో మంత్రి అవినీతి, కబ్జాలపై ప్రశిస్తున్న వారిని వేధిస్తున్నారు. ఇది తట్టుకోలేక మంత్రి వారిపై కక్షగట్టి కిడ్నాప్ కూడా చేయించారు. మహబూబ్‌నగర్ ప్రజలకు వాస్తవాలు తెలుసు. సైబరాబాద్ సీపీ ప్రెస్‌మీట్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అవకాశం ఉన్న అన్ని విచారణ సంస్థలు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. నిజానిజాలేంటో అందరికి తెలిసేలా చేస్తాం."

- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

రాజకీయ కుట్రతోనే కేసులు

BJP Responds on Srinivas Goud Murder Plan : "మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ రాజకీయ కుట్రతోనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఆయన తప్పులు బయటపెట్టిన యువకులపైనే హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడతారా? తెరాసలో చేరి అరాచకాలకు వంత పాడతారా?"

- జితేందర్ రెడ్డి, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు

Conspiracy to Kill Srinivas Goud : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకుల నివాసాలపై బుధవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. మహబూబ్‌నగర్‌లోని శ్రీకృష్ణ దేవాలయ సమీపంలోని మాజీ ఎంపీ, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ముందున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జితేందర్‌రెడ్డి ఇంటికి కొంత దూరంలోనే ఉన్న మాజీ మంత్రి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంటిపైనా రాళ్లదాడి జరిగింది. ఈ దాడుల్లో ఎవరికి గాయాలు కాలేదు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టామని ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఇదిలా ఉండగా జితేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు సురేందర్‌ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తి అర్ధరాత్రి దాడి చేశారు. పోలీసువాహన సైరన్‌ విని పారిపోయినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.