ETV Bharat / city

అకాల వర్షం.. చేతికొచ్చిన పంట వర్షార్పణం

author img

By

Published : Apr 23, 2021, 9:14 PM IST

రాష్ట్రంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను నిండా ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఆఖరకు నీటిపాలవుతోంది. రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలకు.. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగండ్ల వానకు వరి ధాన్యం నేలకొరగగా... మామిడి, నిమ్మకాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిముద్దయింది.

rain loss in telangana
తెలంగాణలో పెద్దఎత్తున పంట నష్టం
అకాల వర్షం.. చేతికొచ్చిన పంట వర్షార్పణం

అకాలవర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నిండా ముంచాయి. వరి ధాన్యం నేలకొరగగా... కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమూ తడిసిముద్దయింది. మామిడి, నిమ్మతోటలకు అపార నష్టం వాటిల్లింది.

చేతికొచ్చిన పంట నీటి పాలు..

ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా 25.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నీటిపాలైంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనాజిపూర్, మాదారం గ్రామాల్లో మామిడి చెట్లు నేలకూలాయి. బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.

ధాన్యం వర్షార్పణమైంది..

యాదగిరిగుట్టలో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. నకిరేకల్ మండలం నోములలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలు విడిచాయి. నల్గొండ పట్టణంలోని ఆర్జాలాబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం తడిసిపోవటంతో రైతులు ఆందోళకు దిగారు. తేమ సాకుతో అధికారులు కొనుగోలు చేయనందునే తమ ధాన్యం నీటిపాలైందని వాపోయారు. నల్గొండలోని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. మిర్యాలగూడలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి వేములపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవులపల్లి మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐకేపీ కేంద్రాలు, పీఏసీఎస్​ సెంటర్లకు తీసుకువచ్చిన ధాన్యం వర్షార్పణమైంది.

కోమటిరెడ్డి ఆందోళన..

ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలంటూ.... భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసనకు దిగారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ యార్డు వద్ద రైతులతో కలిసి ఆయన బైఠాయించారు. నెల రోజుల నుంచి ధాన్యం తీసుకువస్తున్నా ఇప్పటివరకు అసలు కొనుగోళ్లే జరపడం లేదంటూ మండిపడ్డారు. అధికారుల తీరుతో... పంటలు నీటిపాలై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో..

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి వరి, మొక్కజొన్న, వేరుశనగ, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పాలెం, నందివడ్డెమాన్, మహాదేవునిపేట, లట్టుపల్లి, గంగారం గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అల్లిపూర్, ఊడుగులకుంట తండాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

మరో మూడురోజుల పాటు..

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీచూడండి: 'రైస్​ మిల్లులకు వచ్చిన తర్వాత తరుగుతీయడం అన్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.