ETV Bharat / city

డీసీసీబీలను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి - EXCISE MINISTER SRINIVAS GOUD

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో సహకార కేంద్ర బ్యాంకులకు సంబంధించి నూతన పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరయ్యారు. కొత్త పాలకవర్గం రైతులకు అన్ని విధాల సహకరిస్తూ భరోసా ఇవ్వాలని మంత్రి సూచించారు.

రైతులకు పూర్తిగా సహకరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Mar 12, 2020, 7:52 PM IST

వ్యవసాయ సహకార సంస్థలను, బ్యాంకులను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన పాలకవర్గ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సహకార బ్యాంకు అంటే కేవలం సేవలకే పరిమితం కాదన్నారు. రైతులకు అన్ని విధాలా పూర్తి సహకారం అందించాలని సూచించారు.

రైతులకు పూర్తిగా సహకరించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

రైతులకు అవసరమైయ్యే మార్కెటింగ్‌ వ్యవస్థ నుంచి గోదాముల నిర్మాణాల వరకు దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు వాటి అవసరాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు, సంఘాలకు ఉన్న సమస్యలపై డైరెక్టర్లంతా సమష్టి నిర్ణయాలు తీసుకుని పరిష్కరించాలని కోరారు. రైతులకు సంబంధించిన సమాచారమంతా సేకరించి పెట్టుకోవాలని ఆదేశించారు. రైతులకు నూతన డైరెక్టర్లతో పాటు అధికారులు పూర్తి స్థాయిలో భరోసా కల్పించే విధంగా ఉండాలన్నారు.

ఇవీ చూడండి : 'ఆ దుష్ప్రచారంతో ఈటలకు రూ.10కోట్ల నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.