కరోనా అంశంలో పాలమూరు వాసులు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాం కిషన్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. జిల్లా ఆస్పత్రిలో 30 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు.
కరోనా ప్రభావం ఉన్న దేశాల నుంచి ఎవరైనా జిల్లాకు వస్తే.. వారికి కౌన్సిలింగ్ ఇస్తామని, హౌస్ ఐసోలేషన్పై అవగాహన కల్పిస్తామన్నారు. నోడల్ సెంటర్ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమానితుల రక్త నమూనాల సేకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. వ్యక్తిగత భద్రత పరికరాలు, మాస్క్లు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
ఇవీచూడండి: కరోనాపై ప్రముఖుల ప్రచారం