ETV Bharat / city

ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి చందంగా

author img

By

Published : Nov 14, 2020, 5:06 PM IST

తుంగభద్ర పుష్కరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్క అడుగు ముందుకి... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. భక్తులు అధికంగా వస్తారని భావిస్తున్న శక్తిపీఠం అలంపూర్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా... మిగిలిన 3 ఘాట్లలో అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. మరోవైపు 3ఘాట్ల వద్ద నదిలో నీళ్లు లేనందున పుష్కరాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గడువు సమీపిస్తున్నా... తాత్కాలిక ఏర్పాట్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి.

arrangements  of  Tungabhadra puskaralu  2020 going to too slow in gadwal district
ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి చందంగా పనులు

ఈ నెల 20 నుంచి డిసెంబర్‌ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. సమయం దగ్గర పడుతునందున జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాత్కాలిక ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. రెండున్నర కోట్లు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో కుట్కనూరు వద్ద తుంగభద్ర నది జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆలంపూర్ ఆవతల సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. ఈ మార్గం మధ్యలో నాలుగు చోట్ల మాత్రమే పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐజ మండలం వేణి సోంపూర్, రాజోలి, ఉండవెల్లి మండలం పుల్లూరు, అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్కింగ్, క్యూలైన్లు, చలువ పందిళ్లు, ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు, ఆలయ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

నదీ స్నానాలకు అనుమతిస్తారా?

రాజోలి, పుల్లూరు, వేణి సోంపురం ఘాట్లలో మాత్రం నదిలో నీళ్లు లేవు. దూరంగా నడిచి వెళ్తే తప్ప నదిలోకి వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తారా? నదీ స్నానాలకు అనుమతిస్తారా? వేచిచూడాల్సి ఉంది. రాజోలిలో మాత్రం నది పక్కనే పురాతన ఆలయం ఉన్నందున వచ్చే భక్తుల కోసం గ్రామ పంచాయతీ, దేవాదాయశాఖ అధ్వర్యంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు 12 రోజులు అన్నదానం నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. పుల్లూరు, వేణిసొంపూరు ఘాట్ల వద్ద ఏర్పాట్లు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. మరోవైపు పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా పోలీసులు బందోబస్తు కోసం సన్నద్ధమవుతున్నారు. కొవిడ్‌ వేళ దేవాలయాలు, ఘాట్ల వద్ద జనం గుమికూడకుండా భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.

పుష్కరాలకు సమయం దగ్గరపడుతున్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్​లో గ్రేటర్ ఎన్నికల సందడి... గెలుపు గుర్రాల కోసం వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.