ETV Bharat / city

Amrabad Tiger Reserve : పెద్దపులిని.. ఇక తెలంగాణలోనే చూసెయ్యొచ్చు! - అమ్రాబాద్ టైగర్ రిజర్వులో టైగర్ స్టే

ఇకపై పెద్దపులిని(Tiger) చూడాలంటే కర్ణాటకలోకి బందీపూర్‌, మధ్యప్రదేశ్‌లో కన్హా, మహారాష్ట్రలోని తాడోబా టైగర్‌ రిజర్వుకు వెళ్లాల్సిన అవసరం లేదు... ఇక మన రాష్ట్రంలోనే చూడొచ్చంటోంది అటవీశాఖ(Telangana forest ministry). అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు(Amrabad Tiger Reserve)ను సరికొత్తగా తీర్చిదిద్ది పర్యాటకులను రా రమ్మంటోంది...

Amrabad Tiger Reserve
Amrabad Tiger Reserve
author img

By

Published : Nov 14, 2021, 7:10 AM IST

జింకల పరుగులు... వాటిని తరుముతున్న రేచు కుక్కలు.. అంతదూరంలో పులి రాకను గుర్తించి అరుస్తున్న పక్షులు. భయంభయంగా కదులుతున్న ఇతర వన్య ప్రాణులు. ఇదీ నల్లమల(Nallamala forest) చిత్రం.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని వ్యూపాయింట్లు

దట్టమైన అడవి మధ్యలో వంపులు తిరుగుతూ కృష్ణమ్మ పరుగులు.. జలపాతాలు... 301 రకాల పక్షులు.. 20కి పైగా పులులు, వంద పైచిలుకు చిరుతలు, వేలల్లో జింకలు, 29 రకాల వన్యప్రాణులు.. జీవవైవిధ్యంతో అలరారుతున్న నల్లమల సీమ(Nallamala forest) ఇది. ఈ అడవుల్లోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు(Amrabad Tiger Reserve) రాష్ట్రంలో సరికొత్త ప్రకృతి పర్యాటక ప్రాంతంగా(Tourist place) రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటివరకు శ్రీశైలం క్షేత్రం వెళ్లే ప్రయాణికులు దారి మధ్యలో పరిమిత ప్రదేశాల్లోనే, అదీ కొద్దిసేపు మాత్రమే ఉండే అవకాశమే ఉంది. ఇప్పుడు దట్టమైన అటవీప్రాంతంలో బస చేయడం, ట్రెక్కింగ్‌(Trekking)తో పాటు పులులు, పలురకాల వన్యప్రాణుల్ని అతిదగ్గరి నుంచి చూసే అవకాశాన్ని అటవీశాఖ తీసుకువస్తోంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ‘టైగర్‌ స్టే(Tiger stay)’ ప్యాకేజీతో పర్యాటకం ఆకర్షణీయంగా మారనుంది. ప్రస్తుతం మన్ననూరు చెక్‌పోస్టు వద్ద ‘వనమాలి’లో ఉన్న డజను కాటేజీల్లో బస కల్పిస్తారు. త్వరలో దట్టమైన అడవి మధ్యలో గుడారాల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్టోపస్‌ వ్యూపాయింట్‌, మల్లెలతీర్థం సందర్శనలతో పాటు నల్లమలలో విహారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు.

.

ఈ ప్యాకేజీ అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు(ఏటీఆర్‌(Amrabad Tiger Reserve)) పరిధిలోని మన్ననూరులో మొదలవుతుంది. సాయంత్రం పులులు తిరిగేచోట సఫారీ, ఉదయం ఉమామహేశ్వరం ఆలయం వరకు అడవిలో 3.5 కి.మీ. 2 గంటల ట్రెక్కింగ్‌ ఉంటుంది. ఫర్హాబాద్‌గేట్‌-వ్యూపాయింట్‌-గుండం గేట్‌ వరకు దట్టమైన అడవిలో 25 కిమీ మేర సాగే ఈ పర్యటన ఆహ్లాదకరంగా, అనుక్షణం ఉత్కంఠతో సాగుతుంది. ఇక్కడే మూడు పెద్ద పులులు, ఓ పులి పిల్ల ఉన్నాయి.

.

ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ నుంచి కింద 962 మీటర్ల లోతులో లోయ. ఎటుచూసినా ప్రకృతి అందాలతో రెండుకళ్లూ చాలవు. చైనాలో ఆకాశాన్ని తాకేరీతిలో నిర్మించిన గాజు వంతెనలాంటిది ఇక్కడా నిర్మించేందుకు పర్యాటకశాఖ(Telangana tourism department) ప్రయత్నించింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారసంస్థ(National Tiger Conservation Authority) అనుమతివ్వలేదని సమాచారం.

పులిని చూడొచ్చు...

"సాంబార్‌, చుక్కల జింకలతో పాటు పులినీ చూసే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణ, అడవుల, వన్యప్రాణుల సంరక్షణ ఆవశక్యతనూ పర్యాటకులకు వివరిస్తాం. గైడ్లుగా మరింతమంది చెంచులకు అవకాశమిస్తున్నాం."

- శ్రీనివాస్‌, ఏటీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌, రోహిత్‌, డీఎఫ్‌వో

చెంచు పెంటలు చూపిస్తాం.. జీవనస్థితిగతులు వివరిస్తాం

"మాతో సహా ఆరుగురు చెంచులకు శిక్షణనిచ్చారు. వృక్ష సంపద, వన్య ప్రాణులు, చెంచుల జీవన స్థితిగతులను సందర్శకులకు వివరిస్తాం. ఇటీవల 100 అడుగుల దూరంలో పులిని చూశాం. భౌరాపూర్‌ చెరువు దగ్గర 2 పులులు చూశాం."

- ప్రశాంత్‌, గణేష్‌, గైడ్లు

ఇదీ అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు స్వరూపం (చ.కిమీలలో)

పులులు తిరిగే ప్రాంతం: 2,166.37

సంచరిచే అవకాశమున్నది: 445.03

సఫారీలో సందర్శకుల్ని తిప్పేది: 50-60

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.