ETV Bharat / city

YS Sharmila Padayatra: 'బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారింది'

YS Sharmila Padayatra: పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏ మాత్రం గౌరవించకుండా... కుటుంబ బాగు కోసమే కేసీఆర్‌ పాటుపడుతున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Sharmila
వైఎస్‌ షర్మిల
author img

By

Published : Apr 29, 2022, 10:23 PM IST

YS Sharmila Padayatra: ఉద్యమకారుడని రెండు సార్లు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే... వారే తెలంగాణ ద్రోహులుగా మారారని వైతెపా అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేస్తే రాజన్న పాలన తిరిగి తీసుకొస్తామన్నారు. షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర శుక్రవారం 900 కిలోమీటర్లు పూర్తి చేసుకుని... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల మీదుగా సాగింది.

YS Sharmila
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానయాత్ర

యాత్ర ఆయా మండలాల్లోకి ప్రవేశించగానే వైస్సాఆర్‌ అభిమానులు, వైతెపా నాయకులు, కార్యకర్తలు షర్మిలకు స్వాగతం పలికారు. రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా... ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను కనీసం పలకరించడం లేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మంచి నీళ్లు లేవు కానీ... మద్యం మాత్రం ఏరులై పారుతుందని ఆమె పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారిందని షర్మిల ఆరోపించారు.

'బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి తప్ప... ఎవరికీ బంగారం కాలేదు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారు ? ఎనిమిదేళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వంగా మారింది. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా... కనీసం ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైతెపా అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తాం. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు మహిళల పేరు మీద నిర్మించి ఇస్తాం.'-వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

తెరాస పాలన చూస్తే దోపిడి, దొంగల రాజ్యంగా మారిందని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని అన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తే కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారని, ఆయన మాటలను నమ్మవద్దని కోరారు. వైతెపా అధికారంలోకి వస్తే నిరుద్యోగులు రైతన్నలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:KA Pal on KCR: కేటీఆర్​కు సీఎం పదవి తప్పా ఏదీ కావాలన్నా ఇస్తాం: కేఏ పాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.