ETV Bharat / city

ఏజెన్సీ ప్రాంతాల్లో 'పురిటి నొప్పులకు ముందే ప్రసవ వేదన' - bhadradri kothagudem agency villages

పురిటినొప్పులు పునర్జన్మతో సమానమంటారు. ప్రతి రూపానికి ప్రాణం పోసేందుకు ఆ మహిళ ప్రాణాన్ని సైతం పణంగా పెడుతుంది. అలాంటి పురిటి నొప్పులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటున్న నిండు గర్భిణులకు.. ఏజెన్సీ పల్లెల్లో ప్రసవానికి ముందు ఎదురయ్యే కష్టాలు మాత్రం దినదిన గండంగా మారుతున్నాయి. ఆసుపత్రులకు వెళ్లేందుకు పడుతున్న కష్టాలు ఎన్నాళ్లీ ప్రసవ వేదన అంటూ ఆవేదన కలిగిస్తున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో 'పురిటి నొప్పులకు ముందే ప్రసవ కష్టాలు'

author img

By

Published : Jul 25, 2020, 6:24 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణిలకు పురిటి నొప్పులకు ముందే ప్రసవ కష్టాలు తప్పడం లేదు. ఏటా వర్షాకాలం వచ్చిందంటనే ప్రసవాల కోసం వణుకుతున్న పల్లెల్లో.. ఈసారీ ఆ కష్టాలు తప్పడం లేదు. మరీ ముఖ్యంగా గుండాల మండలంలో మహిళల ప్రసవ కష్టాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

అసలే అంతంతమాత్రం వైద్య సదుపాయాలు ఉండే ఏజెన్సీ గ్రామాల్లో... వానాకాలంలోనైతే బిడ్డకు జన్మనివ్వడం అటుంచితే... ప్రసవమంటేనే వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడమే కాదు... కడుపులోని బిడ్డను కాపాడుకుంటూ వాగులు, వంకలు దాటుతున్నారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం రావడం లేదు.

నానా అవస్థలు..

ఇటీవలి వర్షాలకు గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమెలికలవాగు, ఎదర్రేవు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మల్లన్నవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో గుండాల మండలం నరసాపురం తండాకు చెందిన నునావత్ మమత అనే 8 నెలల గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు నానా అవస్థలు పడ్డారు.

కష్టాలు వర్ణణాతీతం..

ద్విచక్రవాహనంపై ఆమెను తీసుకువెళ్లగా మల్లన్నవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన సైతం కొట్టుకుపోవడంతో గర్భిణిని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లి ఒడ్డు దాటించారు. ఒకవైపు పురిటినొప్పులతో మరోవైపు వరద ప్రవాహంతో గర్భిణి పడిన కష్టాలు వర్ణణాతీతం.

అసలే అతికష్టం మీద వాగు దాటి గుండాల చేరుకున్న మహిళను ప్రసవం కోసం ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఇల్లెందు వెళితే కొత్తగూడెం వెళ్లాలని చెప్పారు. అయితే పుట్టిల్లు మహబూబాబాద్​లో వైద్యం చేయించుకుంటానని చెప్పగా.... కొవిడ్‌ నేపథ్యంలో వేరే జిల్లాకు 108 వాహనం ఇవ్వలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక ఆటో మాట్లాడుకుని కుటుంబసభ్యులు గర్బిణిని తీసుకెళ్లారు.

బిక్కుబిక్కుమంటూ ఒడ్డుకు..

శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ తరహా ఘటనే మరొకటి చోటుచేసుకుంది. గుండాల మండలం రోళ్లగడ్డకు చెందిన ఈసం వనజ ఆరు నెలల గర్భిణీ. నెలవారీ వైద్య పరీక్షల కోసం గుండాలకు వెళ్లాల్సి ఉండగా... ఆమెను కుటుంబీకులు అతికష్టం మీద వాగు దాటించారు.

మోకాలు లోతు నీరున్న వాగులో నడుచుకుంటూ బిక్కుబిక్కు మంటూ ఒడ్డుకు చేరింది. అతికష్టం మీద ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది.. ఇదొక్కటే కాదు వాగులు ఉప్పొంగితే చాలు గిరిజన మహిళలు కష్టాలు పడిన ఘటనలు అనేకం.

ఫలితం శూన్యం..

ఏజెన్సీ ప్రాంత మహిళలు ప్రసవ వేదనతో కంటతడిపెడుతున్నా అధికార యంత్రాంగానికి మాత్రం పట్టడం లేదు. సాక్ష్యాత్తూ భద్రాద్రి కలెక్టర్ ఎంవీరెడ్డి గర్భిణిలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఫలితం శూన్యం. తూతూమంత్రంగా ఏర్పాటు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: 'సచివాలయం కూల్చివేత చిత్రీకరణను అడ్డుకోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.