హరిత తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపుడిలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ప్రారంభించారు. మొక్కలు నాటడంతోనే పాటు సంరక్షణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.
గ్రామ సర్పంచి ద్వారా ఐదు విడతల్లో నాటిన మొక్కలు వాటి సంరక్షణ గురించి సభావేదిక నుంచి ప్రశ్నించారు. పల్లెప్రగతిలో గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, వీటిలో హరితహారం కూడా ఓ అంశంగా చేర్చి.. పచ్చదనం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జడ్పీ ఛైర్మన్ లింగాల కమలరాజ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్