ETV Bharat / city

ఖమ్మంలో లాక్​డౌన్​ సడలింపు - Lock down In Khammam

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అమలు చేస్తున్న లాక్​డౌన్​ సత్ఫలితాలనిస్తున్నది. ఖమ్మం జిల్లాలో లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్న పోలీసులు కొన్ని ప్రాంతాల్లో సడలించారు.

Lock down In Khammam
ఖమ్మంలో లాక్​డౌన్​ సడలింపు
author img

By

Published : Apr 30, 2020, 6:46 PM IST

ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న లాక్​డౌన్​ను పోలీసులు స్వల్పంగా సడలించారు. కరోనా నివారణలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్​డౌన్​ సత్ఫలితాలనిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేయడంలో విజయవంతమయ్యారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో కూడా పోలీసులు లాక్​డౌన్​ పటిష్టంగా అమలుచేశారు. ప్రజలు సైతం పోలీసులకు సహకరించి లాక్​డౌన్​ అమలులో సహకరించారు.

జిల్లాలో ప్రస్తుతం పాజిటివ్​ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల లాక్​డౌన్​లో కాస్త సడలింపు ఇచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తూనే.. కొన్ని ప్రాంతాల్లో సడలించారు. జిల్లాకేంద్రంలో మొత్తం నాలుగు కంటైన్మెంట్​ ప్రాంతాలు ఉండగా.. పెద్దతండ, మోతినగర్​లో నిబంధనలు సడలించారు. ఖిల్లా బజార్​, బీకే బజార్​ కంటైన్మెంట్​ జోన్​లలో లాక్​డౌన్​ పటిష్టంగా కొనసాగుతున్నది.

ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.