భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో ఇస్తున్న 12 కేజీల బియ్యాన్ని కొంతమంది అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఊరి చివర కందిపొదల్లో బియ్యం సంచులు దాచి ఉంచారు. గతంలో పలుచోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్న అధికారులు తాజాగా పట్టణంలోని సత్యనారాయణపురం సమీపంలోని పొలాల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రభుత్వం ముప్పై రెండు రూపాయలకు కిలో బియ్యం కొని లాక్డౌన్ సమయంలో పేదలకు ఉచితంగా పంచుతుంటే కొందరు మాత్రం ఇలా అక్రమాలకు పాల్పడడం సరికాదన్నారు అధికారులు. తనిఖీ చేసిన అధికారులు నిందితులపై 6ఏ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి: ప్రమాదంలో క్షౌర వృత్తిదారులు