రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి వేతనం 4లక్షలకు పెరిగిందని.. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగుల వేతనాలు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదని తెజస అధ్యక్షులు కోదండరాం అన్నారు. ఖమ్మంలోని ఐఎంఏ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదండరాం విమర్శించారు. ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. 80వేలు ఉద్యోగాలు మాత్రమే నింపిన ప్రభుత్వం.. 1,30,000 భర్తీ చేశామని చెప్పటం హాస్యాస్పదమన్నారు.
కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ఉద్యోగుల మీద లేదన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి.. కాంట్రాక్టర్లను పెంచి పోషించి.. కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. పాలకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు