ఖమ్మం జిల్లాలో తెదేపా మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేణుకా చౌదరి రోడ్షో నిర్వహించారు. జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. హస్తం గుర్తుకు ఓటేసి ఖమ్మం ఎంపీ స్థానాన్ని రాహుల్గాంధీకి కానుకగా ఇద్దామంటూ ఓటర్లను ఉత్సాహపరిచారు. సభలో మోదీ, కేసీఆర్‌లపై ధ్వజమెత్తారు రేణుకాచౌదరి. ప్రజలపై భారాన్ని మోపుతూ మోదీ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సంతలో పశువులను కొన్నట్లు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండిః నరేంద్ర మోదీని ఇంటికి పంపాలి: భట్టి విక్రమార్క