ఖమ్మం వాసుల ఉదయపు నడక కోసం నగరంలో అన్ని వసతులతో కూడిన లకారం మినీ ట్యాంక్ బండ్‌ను సిద్ధం చేసినట్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. మేయర్ పాపాలాల్‌తో కలిసి మినీ ట్యాంక్ బండ్‌ను ప్రారంభించారు. సుమారు 2 కోట్లతో నూతన ట్రాక్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఖమ్మంలో చాలా మంది మార్నింగ్ వాక్ చేసే వారున్నారని.. అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కనీసం వెయ్యి మంది శాశ్వత సభ్యత్వం తీసుకోవాలన్నారు. నెలకు వంద రూపాయలు సభ్యత్వ ఫీజు ఉంటుందన్నారు.
నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెత్త వాహనాల కరపత్రం విడుదల చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫిట్ ఫర్ ఇండియా రన్‌ను ప్రారంభించారు. క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ట్రాక్‌పై పరుగులు పెట్టారు. మంత్రితోపాటు కలెక్టర్ కర్ణన్, నగర పాలక కమిషనర్ అనురాగ్, కార్పొరేటర్లు, నగర వాసులు పరుగులో పాల్గొన్నారు.