ETV Bharat / city

మూడోసారి పోటీ పడుతున్న నామా, రేణుకాచౌదరి

పోయిన చోటే వెతుక్కోవాలనే పట్టుదల ఒకరిది..శ‌త్రువుని దెబ్బ‌కొట్టాలనే కసి మరొకరిది. ఖమ్మం పార్లమెంట్​ స్థానంలో పోరు నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. గులాబీ దళం నుంచి నామా..కాంగ్రెస్ అభ్యర్ధిగా రేణుకా చౌదరి ముచ్చటగా మూడోసారి సై అంటున్నారు.

author img

By

Published : Mar 25, 2019, 8:56 PM IST

Updated : Mar 26, 2019, 9:06 AM IST

ఖమ్మం గుమ్మంలో రాజకీయ హోరు

ఖమ్మం గుమ్మంలో లోక్​సభ పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఆఖరి నిమిషంలో నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని అభ్యర్థిగా నిలబెట్టారు గులాబీబాస్. అభ్యర్థి ఎంపికలో మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్..మాజీ ఎంపీ రేణుకా చౌదరినే రంగంలోకి దించింది. 2004, 2009 లోక్​సభ ఎన్నికల్లో నామా, రేణుకా చౌదరి పోటీపడగా చెరోసారి విజయం సాధించారు. ఇప్పుడీ రాజకీయ ఉద్దండులు మూడోసారి పోరుకు సై అనడం ఖమ్మంలో రాజకీయ కాక పుట్టిస్తోంది.

ఖమ్మంలో కారు జోరు

ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీల్లో ఖమ్మంలో మాత్రమే తెరాస అభ్యర్థి పువ్వాడ గెలిచారు. వైరా స్వతంత్ర ఎమ్మెల్యే రాములు నాయక్‌ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు కారెక్కుతామని లేఖలు విడుదల చేశారు. ఏడింట్లో ఐదు స్థానాల్లో నామాకు బలం పెరిగింది. తెదేపాలో ఉన్నప్పుడు ఉప్పునిప్పుగా ఉన్న తుమ్మల, నామా..గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులైన నామా, పువ్వాడ అజయ్‌, సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి ప్రస్తుతం ‘కారులో ప్రయాణిస్తున్నారు. నామా విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ఛరిష్మా, ప్రభుత్వ పథకాలు కలిసొచ్చే అంశాలు. ఎంపీగా కొనసాగిన సమయంలో ఎక్కువమందికి గ్యాస్ కనెక్షన్లు అందించిన ఘనత నామాకు ఉంది. పాలిట్రిక్స్ తెలియకపోవడం, ఇతరులపై ఆధారపడటం ప్రతికూల అంశాలు. ఎన్నికల సమయంలో తప్ప గెలిచిన తర్వాత కనిపించరనే అపవాదు మూటగట్టుకున్నారు.

పట్టుకోసం కాంగ్రెస్ పాకులాట

ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని రంగంలోకి దింపింది కాంగ్రెస్. ముగ్గురు ఎమ్మెల్యేల్లో కందాల, వనమా కారెక్కగా..భట్టివిక్రమార్క శాసనసభపక్ష నేతగా ఉన్నారు. తెరాసపై కసితో ఉన్న కాంగ్రెస్ నేతలు పట్టుసాధించాలని పరితపిస్తున్నారు. నేతలు చేజారినా కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలాగే ఉంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం, హైకమాండ్ వద్ద పలుకుబటి, వాగ్ధాటిగా రేణుకకు కలిసి రానుంది. కేంద్రమంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం ప్లస్ పాయింట్. కాంగ్రెస్​లో వర్గ విబేధాలు, ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరడం ఇబ్బందికరమే. హైదరాబాద్‌లో ఉంటూ ఖమ్మంకు చుట్టపుచూపుగా వస్తారన్న విమర్శా ఉంది.

ఆశల పల్లకిలో ఎర్రసైన్యం

ఖమ్మం లోక్‌సభ స్థానంపై సీపీఎం ఆశలు పెట్టుకుంది. గతంలో ఒక్కసారి మాత్రమే ప్రాతినిథ్యం వహించిన ఎర్రదండు మళ్లీ పూర్వవైభవం సాధించాలని పట్టుదలతో ఉంది. సీపీఎం తరఫున ఆ పార్టీ సీనియర్ నేత బోడ వెంకట్ రంగంలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి వాసుదేవరావు బరిలో ఉన్నారు. కేంద్రం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే అండగా భాజపా నాయకులు ముందుకు వెళ్తున్నారు. న్యూడెమోక్రసీ పార్టీ నుంచి గోకినేపల్లి వెంకటేశ్వర రావు పోటీలో ఉన్నారు.

ఇవీ చూడండి:దేశం కోసం చేయి - సైకిల్​ కలిశాయి: రేణుక

Intro:Body:Conclusion:
Last Updated : Mar 26, 2019, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.