మొదటి కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో గోదావరి నది వద్ద భక్తుల సందడి మొదలైంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
కార్తికమాసం సందర్భంగా భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు.
ఇవీ చూడండి: కార్తిక మాసంలో పూజలు... జన్మ జన్మలకు పుణ్యాలు