ETV Bharat / city

సీహెచ్‌సీల్లో వసతులు కల్పిస్తే.. ఎక్కువమందికి వైద్యసదుపాయం

కొవిడ్‌ రెండోదశ అంతకంతకూ తీవ్రమవుతోంది. పల్లెలు, పట్టణాల్లో బాధితుల సంఖ్య పెరుగుతుంటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించే వారు సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. పరిస్థితి విషమించి ఆస్పత్రులకు వస్తున్న వారు కొందరైతే.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తగా దవాఖానాలను ఆశ్రయిస్తున్న వారు ఇంకొందరు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

author img

By

Published : May 23, 2021, 7:59 AM IST

covid treatment, covid treatment in chc
కరోనా చికిత్స, సీహెచ్​సీలో కరోనా చికిత్స

ప్రైవేటు వైద్యం బాగా ఖరీదవుతోంది. సామాన్య, మధ్యతరగతి బాధితులు రూ.లక్షల్లో బిల్లులు చెల్లించలేక సర్కారు దవాఖానాలకు బారులుదీరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులపై భారం పడుతోంది. ఆస్పత్రుల శక్తికి మించి సేవలందించాల్సి వస్తోంది. రెండు జిల్లాల్లోనూ కొన్ని ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కొవిడ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే జిల్లా ఆస్పత్రులపై భారం తగ్గే వీలుంటుంది. ఆయా సీహెచ్‌సీల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా సరిపడా కేటాయిస్తే స్థానికంగానే బాధితులకు మరింత వైద్యం అందించే వెసులుబాటు ఉంది.

ఖమ్మం జిల్లాలో సుమారు 52 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 10,000 వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 33,899 కేసులు ఉండగా.. 4,587 యాక్టివ్‌ కేసులున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, పెనుబల్లి, మధిరలో కొవిడ్‌ సేవలు అందుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్‌ కేంద్రానికి ఉభయ జిల్లాల నుంచి బాధితులు క్యూ కట్టారు. 320 పడకలున్న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి దాదాపు నెల రోజులుగా ఒక్క పడక కూడా ఖాళీ అన్న మాటే లేకుండా సేవలు అందిస్తోంది. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సదుపాయంతో కావాల్సినంత వసతులన్నీ అందుబాటులో ఉండటంతో ఎక్కువ మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆస్పత్రి కొవిడ్‌ కేంద్రంలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాధితులకు కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యం నిలకడగా వారు సైతం భయాందోళనలకు గురై ఆస్పత్రుల్లో చేరుతుంటంతో పడకలు ఖాళీలు ఉండటం లేదు. దీంతో ఆక్సిజన్‌ అవసరమైన వారికి కొన్నిసార్లు పడకలు దొరక ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే పరిస్థితి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి, భద్రాచలం ఏరియా ఆస్పత్రులపైనా ఉంది.

జిల్లాలో... జూలూరుపాడులో పెద్ద ఆస్పత్రి భవనం ఖాళీగానే ఉంటోంది. ఈ ఆస్పత్రుల్లోనూ కోవిడ్‌ వైద్య సేవలు ప్రారంభిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పాల్వంచ మినహా మిగిలిన ఆస్పత్రుల్లో కొవిడ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. పాల్వంచ ఆస్పత్రిలో 60 పడకలుండగా ఇక్కడ గర్భిణులకు, అత్యవసరమైన కేసులకు సేవలు అందిస్తున్నారు. మణుగూరులో 100 పడకల ఆస్పత్రిని కొవిడ్‌ కేంద్రంగా మార్చారు. ఆక్సిజన్‌ సౌకర్యంతో 10 మంది బాధితులకు వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కేవలం 18 మంది బాధితులకే చికిత్స అందుతోంది. ఇల్లెందు ఆస్పత్రిలో 30 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఓపీ సేవలే అందిస్తున్నారు. వైటీసీలో 50 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 30 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కూడా కల్పించారు. ఇద్దరు వైద్యులు, మరో 10 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వైటీసీలో 50 పడకలు ఉన్నా 20 మందికి మంచి బాధితులకు సేవలు అందించడం లేదు. అశ్వారావుపేట సీహెచ్‌సీలో 30 పడకలుండగా ఇక్కడ కొవిడ్‌ సేవలు అందించేందుకు 100 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 70 పడకల వరకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. మరో 30 పడకల్లో సాధారణ వైద్యం అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో కేవలం 10 మంది బాధితులే ఉన్నారు.

జిల్లా ఆస్పత్రిపై భారం తగ్గేలా చర్యలు

కొవిడ్‌ బాధితుల చేరికతో జిల్లా ఆస్పత్రికి తాకిడి పెరుగుతోంది. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టాం. ఆక్సిజన్‌ లెవల్స్‌ 93కి తక్కువగా ఉన్న వాళ్లను మాత్రమే జిల్లా ఆస్పత్రిలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ సాధారణంగా ఉన్న వాళ్లకు స్థానిక ఐసోలేషన్‌ కేంద్రాల్లోనే వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇల్లెందు, అశ్వారావుపేట ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలున్నాయి. ఆ ప్రాంతాల వారిని అక్కడికే తరలిస్తాం.

పి.వినోద్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.