కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఖమ్మంలో మండిపడ్డారు. వ్యవసాయ దేశంగా ఉన్న భారత్‌ను చీకట్లోకి తీసుకెళ్లేందుకే మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిందని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భవిష్యత్‌ను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రైతుల పక్షాన కనీసం ఆందోళనలు కూడా చేసే వీలులేకుండా కొవిడ్ సమయంలో బిల్లులు తీసుకొచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వ్యవసాయ బిల్లుతో దేశానికి పొంచిఉన్న ప్రమాదం' - cpi leader kunamneni sambashivarao
భాజపా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును సీపీఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. వ్యవసాయ దేశంగా ఉన్న భారత్‌ను చీకట్లోకి తీసుకెళ్లేందుకే ఈ బిల్లులను తీసుకొచ్చిందని ఖమ్మంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['వ్యవసాయ బిల్లుతో దేశానికి పొంచిఉన్న ప్రమాదం' cpi leader kunamneni sambashivarao responded on agriculture bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8905436-520-8905436-1600846445776.jpg?imwidth=3840)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఖమ్మంలో మండిపడ్డారు. వ్యవసాయ దేశంగా ఉన్న భారత్‌ను చీకట్లోకి తీసుకెళ్లేందుకే మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిందని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భవిష్యత్‌ను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రైతుల పక్షాన కనీసం ఆందోళనలు కూడా చేసే వీలులేకుండా కొవిడ్ సమయంలో బిల్లులు తీసుకొచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఉత్తర భారత పంటలకు ఎంఎస్పీ పెంపు సరే... మరి మిగతావాటి మాటేమిటీ?