భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో లైటప్ను ప్రారంభించిన జెన్కో సీఎండీ డిసెంబర్ 2019 లోపు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగు యూనిట్లు పూర్తయ్యేలా కృషి చేస్తామని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఇవాళ బీటీపీఎస్‌లో ప్రత్యేక పూజలు చేసి బ్రాయిలర్ లైటప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బ్రాయిలర్‌లో మంటలు వచ్చేలా స్విచ్ ఆన్ చేశారు. కార్యక్రమం విజయవంతమైనందుకు సీఎండీ ప్రభాకర్‌రావు అధికారులను అభినందించారు.భూములు కోల్పోయిన వారికి ఉద్యోగం
కేంద్రం నిర్మాణంలో భూములు కోల్పోయిన 345 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండిఃతలసాని కుమారుడి భారీ నామినేషన్ ర్యాలీ