ఖమ్మం జిల్లా ఏన్కూరులో మతిస్థిమితం లేని ఇద్దరు వ్యక్తులను అన్నం ఫౌండేషన్ అక్కున చేర్చుకొంది. కోనాయపాలెంలో మతిస్థిమితం లేని వ్యక్తితో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే సమాచారంతో డా. అన్నం శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని.. స్థానిక పోలీసుల సాయంతో ఆశ్రమానికి తరలించారు. మార్గమధ్యలో మరో వ్యక్తిని గుర్తించి ఫౌండేషన్‌కు తరలించారు. ఇలాంటి వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నం శ్రీనివాసరావు కోరారు.
ఇవీచూడండి: బీసీలకు రూ.7వేల కోట్లు కేటాయించాలి: గంగుల కమలాకర్