కరోనా ప్రభావం వల్ల రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేశారు. భక్తులు రద్దీ లేకపోవడం వల్ల మిగిలిపోయిన లడ్డూ ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పంచారు.
కరోనా వ్యాప్తి చెందకుండా శుక్రవారం నుంచి రాజన్న ఆలయాన్ని మూసివేశారు. భక్తులకు పంచడానికి ముందుగానే సిద్ధం చేసిన 36,120 లడ్డూలు మిగిలిపోయాయి. ఆ లడ్డూలను ఏం చేయాలన్న అంశంపై ఆలయ యంత్రాంగం సమావేశమై ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇంటింటికి తిరిగి లడ్డూలను పంచుతున్నారు.
ఆలయ సిబ్బంది ఆటోలో లడ్డూలూ తీసుకెళ్లి వార్డుల్లో ఇంటికి ఒక లడ్డూ చొప్పున పంచుతున్నారు. పనిలో పనిగా.. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: కోరలు చాచిన కరోనా- 12 రోజుల్లోనే లక్ష కేసులు