ETV Bharat / city

Bandi sanjay: 'ఏడేళ్ల మోదీ పాలనలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు' - ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను ప్రారంభించిన బండి సంజయ్​

కేంద్రంలో భాజపా ప్రభుత్వం రెండో సారి ఏర్పడి.....రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... భాజపా సంజీవని కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. కొవిడ్​ బాధితులకు అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేశారు. త్వరలో అత్యవసర సేవలకు అంబులెన్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

bandi sanjay
బండి సంజయ్​
author img

By

Published : May 30, 2021, 3:53 PM IST

కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్​ బాధితులకోసం కరీంనగర్​లో ఉచిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రారంభించారు. పలు మండలాల్లో పేదలకు నిత్యావసర సరకులు, అన్నదానం, మాస్కులు అందించారు.

ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతం చేసేందుకు మోదీ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏడేళ్ల సుధీర్ఘ పాలనలో ఎన్నో సాహసోపేత నిర్ణయాలు అమలు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్​ సంక్షోభంలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్ర కేబినెట్​ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.