Roads Damaged due to Sand Reaches: పెద్దపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల వల్ల సామర్థ్యానికి మించి అధికలోడుతో రవాణా జరిగి రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. సుల్తానాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ వెళ్లే మార్గంలో 14 కిలోమీటర్ల ప్రయాణానికి కనీసం రెండు గంటలకు పైగా సమయం పడుతుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓదెల మండలంలోని అనేక గ్రామాల్లోని రహదారులు ధ్వంసం అయ్యాయి. ఆదాయం కోసం ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ద్విచక్రవాహనాలు సైతం రోడ్డుపై నడపలేక పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓదెల మండలంలో ప్రధానంగా 8 ఇసుక రీచ్‌ల ద్వారా నిరంతరాయంగా ఇసుక రవాణా సాగుతోంది. రీచ్‌లకు అనుమతించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరుగుతుందా లేదా అనే విషయం అసలు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ 300నుంచి 500వరకు లారీలు తిరుగుతున్నాయని... వాటి వల్ల దెబ్బతిన్న రహదారులు బాగు చేయాలని ధర్నాలు చేసినా ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు. సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇసుక లారీలను ప్రభుత్వం అదుపు చేసి రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: