Wandering Bear in Karimnagar: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తిలో... ఎలుగుబంటి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. భల్లూకం సంచరిస్తున్న దృశ్యాలు... సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మామిడి తోటలో తిరుగుతోందని... కాలనీలోకి కూడా వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
సీసీటీవీ ఫుటేజ్లలో నమోదైన దృశ్యాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తామని కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ పేర్కొన్నారు. భల్లూకం నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.