ETV Bharat / city

PM Visits to Ramagundam: ఈ నెలలో రామగుండానికి ప్రధాని మోదీ

PM Visits to Ramagundam: పెద్దపల్లి జిల్లాలోని రామగుండానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారని అధికారిక సమాచారం. ఈ నెల 25 లేదా 26న అధికారికంగా ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. యాజమాన్యం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపడుతోంది.

pm modi
ప్రధాని మోదీ
author img

By

Published : May 6, 2022, 8:30 AM IST

PM Visits to Ramagundam: ప్రధాని నరేంద్రమోదీ త్వరలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఒక రోజు రానున్నారని.. అయితే 26న వచ్చే అవకాశాలెక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఈ కర్మాగార నిర్మాణానికి 2016 ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధాని శంకుస్థాపన చేశారు. గత సెప్టెంబరు 9న మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి క్షణంలో కార్యక్రమం వాయిదా పడింది.

తాజాగా ప్రధానమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం నుంచి మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్‌.ఎఫ్‌.సి.ఎల్‌. యాజమాన్యం అప్రమత్తమై అవసరమైన చర్యలు చేపడుతోంది. వార్షిక మరమ్మతుల కోసం 10వ తేదీ నుంచి కర్మాగారాన్ని షట్‌డౌన్‌ చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రధాని కార్యక్రమం ఉన్నందున వాయిదా వేశారు.

ఇదీ చదవండి:JP Nadda Comments On TRS: 'తెరాస అంటే... తెలంగాణ రజాకార్‌ సమితి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.