లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసి వేయటం వల్ల కల్లు, గుడుంబాకు బాగా డిమాండు పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు కల్తీ కల్లు తయారీకి ఎగబడ్డారు. జగిత్యాల పట్టణంలోని లడ్డూఖాజా చౌరస్తా కటిక వాడ సమీపంలో ఓ ఇంట్లో నీళ్లతోనే కల్తీకల్లు తయారు చేస్తుండగా జగిత్యాల పట్టణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 500 లీటర్ల కల్లుతోపాటు, తయారు చేసేందుకు వినియోగించే డ్రమ్ములు, కల్లులో కలిపే రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జయేష్‌రెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఎస్‌బీ పోలీసులతోపాటు, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్