ETV Bharat / city

కరోనా బాధితురాలిని ఇంట్లోకి అనుమతించని యజమాని - తెలంగాణలో కరోనా ప్రభావం

కరోనా బాధితురాలితో సానుకూలంగా వ్యవహరించాల్సింది పోయి.. అమానవీయంగా ప్రవర్తించాడో ఇంటి యజమాని. తన ఇంట్లో అద్దెకుంటున్న మహిళకు కరోనా వైరస్​ సోకిందనే విషయం తెలిసి.. ఇంట్లోకి అనుమతించలేదు. గత్యంతరం లేక ఆమె మార్కెట్లు, రైల్వే ఓవర్​ బ్రిడ్జి కింద గడిపింది.

Inhumane incident in karimnagar
కరోనా బాధితురాలిని ఇంట్లోకి అనుమతించని యాజమాని
author img

By

Published : Apr 10, 2021, 8:18 PM IST

కరోనా రోగులతో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజల్లో మార్పురావడం లేదు. కొవిడ్​ బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరినా.. అక్కడక్కడా అమానవీయ ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో ఇలాంటి ఘటన జరిగింది. కరోనా సోకిన మహిళను.. ఇంట్లోకి రానివ్వలేదు అద్దె ఇంటి యజమాని. వీలైతే సాయం చేయాల్సింది పోయి... కర్కషంగా వ్యవహరించాడు. గత్యంతరం లేక సదరు బాధితురాలు.. శుక్రవారం మార్కెట్​లో గడపగా.. శనివారం.. రైల్వే ఓవర్​ బ్రిడ్జి కింద ఓ తోపుడు బండిపై తలదాచుకొంది.

విషయం తెలిసిన స్థానిక కాంగ్రెస్​ నేత దిలీప్..​ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది.. వెంటనే ఆమెను కరీంనగర్​లోని ఐసోలేషన్​ వార్డుకు తరలించారు.

ఇవీచూడండి: 'వైరస్​ కట్టడికి.. లాక్​డౌన్​ కన్నా అదే మేలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.