medaram: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కోసం నిలువెత్తు బంగారం సమర్పిస్తానని.. గత ఏడాది సమ్మక్క సారలమ్మలకు తెరాస మహిళా కార్యకర్త స్వరూప మొక్కుకుంది. దాంతో గురువారం ఎమ్మెల్యే నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించి తన అభిమానం చాటుకుంది.
ఎందుకో తెలుసా...
'2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న మహిళ కార్యకర్త యాటకల స్వరూప.. నేను కరోనా బారిన పడి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో ఉన్నప్పుడు సమ్మక్క సారలమ్మలకు నేను ఆరోగ్యంగా, క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ.. నా నిలువెత్తు బంగారం చెల్లిస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి నన్ను రమ్మని రెండు రోజుల క్రితం అడిగింది. ఆ ఆడబిడ్డ నాపై చూపిస్తున్న ప్రేమానురాగం పట్ల... కంట నుంచి నీరు వచ్చింది. స్వరూప కోరిక మేరకు గురువారం వచ్చి సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని తూకం వేసి చెల్లించాను.'
-సతీష్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి:Medaram Invitation Card: మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వాన పత్రిక