ETV Bharat / city

హరితహారం ఓ ఉద్యమంలా చేపట్టాలి: గంగుల

హరితహారం ఏర్పాట్లపై కరీంనగర్​ కలెక్టరేట్​లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్ష నిర్వహించారు. కాంక్రీట్​ జంగల్​గా ఉన్న నగరాన్ని హరితవనంగా మార్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

minister-gangula-kamalakar-reviw-on-harithaharam-at-karimnagar-collectorate
హరితహారం ఓ ఉద్యమంలా చేపట్టాలి: గంగుల
author img

By

Published : Jun 11, 2020, 5:41 PM IST

కరీంనగర్ జిల్లాలో హరితహారం ఒక ఉద్యమంలా చేపట్టాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హరితహారంపై కలెక్టరేట్​లో నగర పాలక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కాంక్రీట్ జంగిల్​గా ఉన్న నగరాన్ని హరిత వనంగా మార్చేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. హరితహారానికి నిధుల కొరత లేదని, అవసరమైతే పట్టణప్రగతి, ఎల్​ఆర్​ఎస్​, డీఎంఎఫ్​టీ నిధులు ఉపయోగించుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలు నాటి, 85 శాతం బ్రతికే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా సరిహద్దుల నుంచి జిల్లా కేంద్రం వరకు ఇరువైపులా 3 వరుసలు చెట్లు నాటి, సంరక్షించాలన్నారు. వీలైనంత వరకు 2 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను నాటాలని, జిల్లాలో ఎస్​ఆర్​ఎస్పీ, ప్రభుత్వ స్థలాలు గుర్తించి ప్రజలకు ఉపయోగకరమైన మొక్కలు నాటాలన్నారు.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.