కరీంనగర్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నగరపాలక సంస్థ కృషిచేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో వాష్ బేసిన్‌ను మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతితో కలిసి మంత్రి గంగుల ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్మికులకు టోపీలను పంపిణీ చేశారు.
చేతుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యాలయానికి వచ్చి వెళ్లే వారి కోసం వాష్‌బేషిన్ ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ పాటించాలని కోరారు. కరీంనగర్లో కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలన్నారు.
ఇవీచూడండి: నగదు, నిత్యావసరాలు పంచిన కరీంనగర్ మేయర్