ETV Bharat / city

రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం వచ్చినా అవే సమస్యలు

author img

By

Published : Dec 15, 2020, 12:23 PM IST

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించినా... సమస్య తీరేలా కనిపించడం లేదు. ధరణి పోర్టల్ నిర్వహణకు గాను దాదాపు 100రోజుల క్రితం రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన ప్రభుత్వం... కోర్టు ఆదేశాలతో ప్రారంభించింది. కానీ రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ఆటంకంగా మారింది. అనధికారిక ప్లాట్ల లే-అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను ఆహ్వానించగా... లక్షల మంది నమోదు చేసుకున్నారు. క్రమబద్ధీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రిజిస్ట్రేషన్లను ప్రారంభించడం వల్ల సరికొత్త సమస్య నెలకొంది.

lrs problem for non agriculture assets registrations in karimnagar
రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం వచ్చినా అవే సమస్యలు

వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్‌ కోసం 100రోజుల ఎదురుచూపులకు వారికి నిరాశే మిగిలింది. ధరణి పోర్టల్‌ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసినా కోర్టు ఉత్తర్వులతో పాతపద్దతిలోనే తిరిగి ప్రారంభించింది. ప్రతిరోజూ 24 మందికి రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు వీలుగా వెసులుబాటు కలిపించింది. ఇంటి నిర్మాణం కోసం రుణాలు, గిఫ్ట్​డీడ్​ చేయించుకోవాలని ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వ ప్రకటనతో ఊరట లభించింది. అయితే ఎల్ఆర్‌ఎస్‌ పూర్తైన ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఎదురుచూపులు..

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌‌ 31 నాటికి 25.59 లక్షల మంది క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12వేల గ్రామపంచాయతీల పరిధిలో 10లక్షలకుపైగా, 141 మున్సిపాలిటీల్లో 10.83 లక్షల మంది రూ. 10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించినా ఇప్పటి వరకు వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమ దరఖాస్తు ఏ స్థాయిలో ఉందనే విషయం వెబ్​సైట్​లో తెలుకునేందుకు కూడా వీలు లేదు. కరీంనగర్ జిల్లాలో 40,775 మంది, జగిత్యాలలో 25,991, పెద్దపల్లిలో 19,265, సిరిసిల్లలో 27, 372 మంది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ అవసరాల నిమిత్తం ఉన్న ప్లాట్లు విక్రయించాలని భావిస్తున్నా లే-అవుట్​ క్రమబద్ధీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతించాలి..

కరీంనగర్‌లో ఈ రోజు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఒక స్లాట్‌ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబధించిన స్పష్టమైన ఉత్తర్వులు తమకు రాలేదని సబ్‌ రిజిస్ట్రార్​ విజయభాస్కర్ తెలిపారు. ప్లాట్లకు సబంధించి మున్సిపాలిటీల్లో పన్ను ఇప్పటికే చెల్లించి ఉంటే వాటి రిజిస్ట్రేషన్‌ చేయవచ్చని వివరించారు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సాంకేతిక సమస్యలు, కొత్త నిబంధనలు ఆటంకంగా మారాయని స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కరించి ప్లాట్లు, ఇళ్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో.. పోస్టుల పునర్విభజనే కీలకం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.