ప్రశ్న: భాజపా పరంగా లాక్‌డౌన్ పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి భాజపా కార్యకర్త తమ వంతు సాయంగా పేదలకు ఆదుకుంటూనే ఉన్నారు. వలస కార్మికుల భాజపా అండగా అంది. వారికి వసతి కల్పించి రోజు భోజనాలు పెడుతున్నారు.
ప్రశ్న: రక్తకొరత నివారించడానికి, తలసేమియా బాధితులను ఆదుకోవాడానికి పార్టీ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు?
జవాబు: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని భాజపా యువ మోర్చ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ప్రారంభించాం. హైదారాబాద్‌లోని ఐదు ప్రాంతాలతో పాటు జిల్లా కేంద్రాలు, మండలాల్లో సేకరించిన వివరాలతో రక్తదాతల జాబితా తయారు చేశాం. ఈ జాబితాను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశాం. ఎవరికి రక్తం కావాలన్నా.. జాబితాలోని వ్యక్తులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశ్న: రెడ్‌జోన్ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. అక్కడేమైనా సమస్యలున్నాయా? మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి?
జవాబు: ప్రస్తుతం ప్రపంచమంతా ఒక భయానక వాతవరణం నెలకొంది. రెడ్‌జోన్ ప్రాంతాల్లోని ప్రజలకు భరోసానిచ్చెందుకు, ధైర్యం నింపేందుకు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో పర్యటించాం. అధికారులు, ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారు. ప్రజల కూడా స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. వలస కూలీలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రేషన్‌కార్డులు లేకపోయినప్పటికి ఆధార్‌కార్డు ఆధారంగా బియ్యంతో పాటు నగదు పంపిణీ చేయాలని.. మార్గదర్శకాలు విడుదల చేసినా అమలు చేయడం లేదు. అందువల్లనే వలస కూలీలు తమ గ్రామాల బాటపడుతున్నారు.
ఇదీ చదవండి: శిబిరం నుంచి తప్పించుకున్న 30 మంది తెలుగు కూలీలు